3.2 C
New York
శుక్రవారం, జనవరి 31, 2025

Buy now

spot_img

ప్రజల ఆస్తులను దోచుకునేందుకే భూ యాజమాన్య చట్టం

అనకాపల్లి: ప్రజల ఆస్తులను దోచుకునేందుకే వైసీపీ ప్రభుత్వం భూయాజమాన్య చట్టాన్ని తీసుకొచ్చిందని మాజీ మంత్రి, టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమన్వయకర్త దాడి వీరభద్రరావు అన్నారు. రింగురోడ్డు డీవీఆర్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఎమర్జెన్సీని తలపించేలా సీఎం జగన్ పాలన సాగుతోందనన్నారు. ఇప్పటికే ప్రభుత్వ భూములు కబ్జాచేసి తాకట్టు పెట్టేసిన సీఎం జగన్, ఇపుడు ప్రజలు, ప్రైవేటు ఆస్తులను కబ్జా చేయడానికే భూయాజమాన్య చట్టాన్నా జగన్ తీసుకువచ్చారని ఆరోపించారు. ప్రజలతో సంప్రదించి చట్టాన్ని అమలు చేస్తామని మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లాం, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెబుతుండడం చూస్తుంటే ప్రజలను వెర్రివాళ్లగా చూస్తున్నట్లు స్పష్టమౌతోందన్నారు. తక్షణమే భూయాజమాన్య చట్టాన్ని రద్దుచేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలన్నారు. చట్టం అమలు కాలేదని అధికారులు ఎన్నికల కమిషన్కు చెప్పడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం అన్నారు.2023 అక్టోబర్ 31న జీవో నెంబర్ 512ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని, ఇంతకంటే ఏమి కావాలని అధికారులను ప్రశ్నించారు. సివిల్ కోర్టులు కూడా దీనిపై కేసులు తీసుకోవడం మానేసాయన్నారు. జీవోకు వ్యతిరేకంగా న్యాయవాదులు నెలరోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేసినా ఈ వైసీపీ ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తుందన్నారు. చట్టాన్ని అమలు చేయకుంటే అజయ్కల్లాం వంటి సీనియర్ ఐఏఎస్ అధికారి రోడ్డుపైకి పంపి ఆయనతో అబద్దాలు చెప్పిస్తున్నారని దాడి ఆరోపించారు. చట్టం అమలు జరగనప్పుడు జీవోను వైసీపీ ప్రభుత్వం ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. పంట భూమి, అపార్టుమెంట్లు, పరిశ్రమలకు చెందిన ఏ ఆస్తి అయినా ఈ చట్టం పరిధిలోకి వస్తుందన్నారు. ప్రైవేటు ప్రజల ఆస్తులను కబ్జా చేయడానికే ఈ చట్టాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందని, ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే భూయాజమాన్య చట్టాన్ని రద్దు చేయాలని దాడి డిమాండ్ చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles