ఫ్యాన్ గుర్తుకే మా ఓటు అంటూ జై కొడుతున్న జనం
అనకాపల్లి: జీవీఎంసీ 82 వార్డులో కార్పొరేటర్ మందపాటి సునీత,జానకిరామరాజు ఆధ్వర్యంలో వైఎస్సార్ సిపి పార్టీ కే ఓటు వేయాలని,ఇంటింటికి ఎన్నికల ప్రచారం శుక్రవారం న్యూ కాలనీలో అనకాపల్లి నియోజకవర్గ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్, పార్లమెంట్ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు కు మద్దతుగా ప్రచారం చేశారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ పాల్గొని,ఇంటింటికి వెళ్లి వైయస్సార్ పార్టీ కరపత్రాన్ని ఇంటింటికి వెళ్లి అందిస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు అడుగడుగునా మలసాల భరత్ కుమార్ కు ప్రజల నుండి ఆదరణ లభిస్తుంది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ అధికారుల్లోకి వస్తే ఈ ప్రాంతంలోని యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన చెప్పారు.అనకాపల్లి లో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పేదవారికి గృహాలు మంజూరు చేశారని, ప్రభుత్వ పథకాలన్నీ నేరుగా మహిళలకు అందించారని భరత్ కుమార్ చెప్పారు. ప్రజలకు ఎన్నడు మేలు చేయని తెలుగుదేశం పార్టీ, మళ్లీ ప్రజలను ఓట్లు అడిగేందుకు వస్తోందని,ఆ పార్టీని నమ్మద్దని భరత్ విజ్ఞప్తి చేశారు..
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు డాక్టర్ రామ్మూర్తి, రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి పలకా రవి, ఉగ్గిన శ్రీనివాసరావు, పలక సత్యనారాయణ, ములును శ్రీనివాసరావు, అల్లు త్రినాథ్,మొగులపల్లి సుభద్ర, మొగులపల్లి సుబ్బారావు, గైపురి రాజు,కుండల రామకృష్ణ,కోండ్రం సత్తిబాబు,చింతా రాంజి, మొల్లేటి మూర్తి, కడిమిశెట్టి సతీష్, కడిమిశెట్టి లక్ష్మణరావు, గుండా రమేష్ గుప్తా,పసుమర్తి రాము, గుండా శ్రీరామ్, కంచర్ల శ్రీను, సుధీర్, రాజేశ్వరి, గ్రంధి శంకర్, పివెంకట్రావు, శ్రీధరాలమనోజ్,సోమోదుల హేమ, డొంక సత్తిబాబు,పార్టీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు..