3.1 C
New York
శుక్రవారం, జనవరి 31, 2025

Buy now

spot_img

జిల్లాలో వంద శాతం వెబ్ కాస్టింగ్ -కలెక్టరు రవి పట్టన్ శెట్టి

అనకాపల్లి, మే 7: జిల్లాలో అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టరు జిల్లా కలెక్టరు రవి పట్టన్ శెట్టి తెలిపారు. మంగళవారం కలెక్టరు కార్యాలయంలో పార్లమెంటుకు పోటీ చేస్తున్న అభ్యర్ధులు, వారి ఏజెంట్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో (పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గంతో కలిపి) 15 లక్షల 96 వేల 916 మంది ఓటర్లు వున్నారని, 4449 మంది సర్వీసు ఓటర్లు కలరని చెప్పారు. 1828 పోలింగ్ కేంద్రాలు వున్నాయన్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 1859 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1927 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు, 7480 మంది ఇత పోలింగ్ అధికారులు వున్నారని తెలిపారు. 380 మంది సూక్ష్మపరిశీలకులను నియమించామని చెప్పారు. 1000 మంది 85 సం.లు నిండిన, దివ్యాంగులైన ఓటర్లనుండి ఫారం-12 హోమ్ ఓటింగ్ కు ధరఖాస్తు చేయగా 880 మంది హోమ్ ఓటింగ్ ను వినియోగించుకున్నట్లు చెప్పారు. అత్యవసర సేవలకు చెందిన 1340 మందికి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వగా ఇప్పటి వరకు341 మంది వోటువేసి తిరిగి పంపించారని తెలిపారు. ఎన్నికల విధులలో వున్న 11,518 మంది పోస్టల్ బ్యాలట్ తీసుకోగా 6వ తేదీ నాటికి వారిలో 5126 మంది ఓట్ చేసారన్నారు. పార్లమెంటుకు పోటీ చేయుచున్న అభ్యర్ధులందరూ తమ బూత్ఏజెట్లను నియమించాలన్నారు. ఇతర నియమ నింబంధనలను గూర్చి వివరించారు. ఈ సమావేశంలో డి.ఆర్.ఓ. బి.దయానిధి, నోడల్ అధికార్లు ఎపిఎంఐపి ఏడి జి.వి.లక్ష్మి, మత్స్యశాఖ డిడి పి.ప్రసాదు, పశుసంవర్ధక శాఖ జెడి బి.ప్రసాదు, డిఎంఅండ్ హిచ్ వో ఏ.హేమంత్, సిపివో జి.రామారావు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు డి.రామ్మూర్తి, వివిధ అభ్యర్ధుల ఏజెంట్లు పి.ఉమాదేవి (బిఎస్పి), వి.అభిషేక్ (కాంగ్రెస్), పి.ప్రకాశరావు పిరమిడ్ పార్టీ ఎం.సంగీత్ (బి.జె.పి), ఎ.అనిల్ కుమార్ (వైసిపి), ఎస్.కె. భాషా (ఇండిపెండెంట్) తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles