అనకాపల్లి: బార్ అసోసియేషన్ హాలులో జై భారత్ నేషనల్ పార్టీ అనకాపల్లి నియోజకవర్గ ఎంఎల్ఏ అభ్యర్థి కనిశెట్టి సురేష్ బాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అభ్యర్థి న్యాయవాదులు ఉద్ధేశించి ప్రసంగించారు.వారి సహాయ సహకారాలు అందించాలని కోరారు.ఈ సమావేశంలో జై భారత్ నేషనల్ పార్టీ అనకాపల్లి నియోజకవర్గానికి విడుదల చేసినటువంటి హామీలను వివరించారు. ప్రధానంగా సమస్యలకు పరిష్కారానికి తీసుకునే చర్యలను విపులంగా తెలిపారు. తుమ్మపాల చక్కెర కర్మాగారం ఆధునికరణ,ఆర్ ఈ సి ఎస్ ను ఏపీపీడీసీఎల్ లో విలీన ప్రక్రియ నిలుపుదల, నాణ్యమైన విద్యుత్ సరఫరా, ఎస్ టి,ఎస్ సి నిరుపేదలకు ఉచిత కరెంట్,రైవాడ జలాశయం ద్వారా రైతులకు సాగునీరు, శారద నది నీరు శుద్ధి చేసి ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా త్రాగునీరు సరఫరా, జిల్లా ఎన్టీఆర్ ఆసుపత్రిని కేజీహెచ్ కు దీటుగా అన్ని మౌలిక సదుపాయాలతో తగిన సిబ్బందిని నియామకం చేస్తామన్నారు. అనంతరం న్యాయవాదులను ఓటు వేసి గెలిపించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి బార్ అసోసియేషన్ ఎన్నికల అధికారి ప్రభాకర్ ప్రస్తుత ఉపాధ్యక్షులు బందం వెంకటరావు మరియు ఇతర సీనియర్ జూనియర్ న్యాయవాదులు సానుకూలంగా స్పందించారు.