అనకాపల్లి: జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ ఆదేశాల మేరకు అనకాపల్లి సబ్-డివిజన్ డీఎస్పీ శ్రీ ఎస్.అప్పలరాజు గారి సూచనల మేరకు అనకాపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పైడపు నాయుడు వాహన తనిఖీలు చేస్తున్న సమయంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ 25 మంది పట్టుబడ్డారు.వీరిని అనకాపల్లి, 13వ ఎం.ఎం కోర్టులో ఈరోజు ప్రవేశపెట్టగా జడ్జ్ బి.వి.విజయలక్ష్మి వాహనదారులకు ఒక్కొక్కరికి రూ.10,000/- చొప్పున మొత్తం రూ.2,50,000/- జరిమానా విధించడం జరిగింది.అనకాపల్లి పట్టణ పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి ట్రిపుల్ రైడింగ్, సెల్ఫోన్ డ్రైవింగ్ మరియు హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారుల పై 63 కేసు నమోదు చేసి, రూ.6,800/- జరిమానా విధించారు.