అనకాపల్లి: ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సజావుగా సాగవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మాజీమంత్రి ,ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ అన్నారు. పట్టణ జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటర్ల జాబితాలో అవకతవకలను గుర్తించినట్లు చెప్పారు. అధికారులు స్పందించి సరి చేయాలన్నారు. 35 సంవత్సరాల తన రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓటర్ల జాబితా గందరగోళానికి గురి చేసే పరిస్థితి ఉందన్నారు.ఇప్పుడున్న ఓటర్ లిస్ట్ చూస్తేఅయోమయానికి గురికావాల్సి వస్తుందని అన్నారు.గతంలో ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి బై ఎలక్షన్ లో సుమారు 35,000 బోగస్ ఓట్ల కార్డులను డౌన్లోడ్ చేసుకొని గత ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపొందడం జరిగిందని ఆరోపించారు.అనకాపల్లి నియోజకవర్గంలో ఇప్పుడు వరకు సుమారు 18 వేల బోగస్ ఓట్లు తొలగించడం జరిగిందన్నారు.ఇది పొరపాటున జరిగి ఉంటే తప్పు కాదని కానీ అధికార పార్టీ ఉద్దేశపూర్వకంగానే చేస్తుందన్న అనుమానం వ్యక్తం చేశారు. అనకాపల్లిలో ఒకే డోర్ నెంబర్ పై200 నుంచి 300 వరకు బోగస్ ఓట్లు ఉన్నాయని తక్షణమే ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టి ఇలాంటి వాటిని తొలగించవలసిన అవసరం ఉందని రామకృష్ణ తెలిపారు.ఈ కార్యక్రమంలో అనకాపల్లి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పీలా గోవింద సత్యనారాయణ , తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ బుద్ధ నాగ జగదీశ్వరరావు , మల్ల సురేంద్ర , పొన్నగంటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.