2 C
New York
శుక్రవారం, జనవరి 31, 2025

Buy now

spot_img

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో 2 ఇళ్ళు దగ్ధం

ఘటన స్థలాన్ని పరిశీలించిన మాడుగుల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి ఈర్లీ అనురాధ

చీడికాడ:మండలంలోని దండి సురవరం గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున విద్యుత్‌ సర్క్యూట్‌తో 2 ఇల్లు దగ్ధం అయ్యాయి. గండిమ వెంకట సూరి అప్పారావు, బత్తిన గంగ రాజు ఇల్లులోని వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. వెంకట సూరి అప్పారావు ఇంట్లోని ₹2 లక్షల 70 వేల రూపాయల నగదు, 6 తులాల బంగారం, గంగ రాజు ₹70 వేల రూపాయల నగదు దగ్ధమైంది. హుటాహుటినఘటన స్థలికి చేరుకున్న చోడవరం అగ్నిమాపక శకటం, సిబ్బంది మంటలను అదుపు చేసారు. ఒక టన్ను ధాన్యం,  2 కట్టల మినుములు చిన్నారుల పుస్తకాలు, ట్యాబ్ లు సర్వం పూర్తిగా దగ్ధం అయ్యినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసారు. ఘటన స్థలానికి  మాడుగుల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి అనురాధ చేరుకొని భాదితులను పరామర్శించారు. జరిగిన నష్టాన్ని పరిశీలించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధితుల తరఫున ఆమె అధికారులను కోరారు. ఆమె వెంట మండల పార్టీ అధ్యక్షులు రాజబాబు, పలువురు నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

మాడుగులకు చెఱుకు తోట దగ్ధం
మాడుగులలోని బొడ్డేడ శ్రీనుకు చెందిన సుమారు రెండు ఎకరాల చెఱకు తోట అగ్నికి ఆహుతి అయ్యింది. ఘటన స్థలాన్ని మాడుగుల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి ఈర్లీ అనురాధ మంగళవారం ఉదయం సందర్శించి, రైతు శ్రీనును పరామర్శించారు. ఘటనపై అరా తీశారు. నష్టపరిహారం దిశగా రైతుని ఆదుకోవాలని సంబంధిత అధికారులను ఆమె కోరారు. ఆమె వెంట మాజీ ఎంపిపి రాజారాం, బొమ్మి శెట్టి శ్రీనివాస్, తదితరులు నాయకులు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles