అనకాపల్లి:పార్టీలు మారుతూ అవకాశవాద రాజకీయాలు చేస్తూ ప్రత్యర్థులపై బురదజల్లే చర్యలు పెద్దలకు తగదని పార్లమెంట్ సభ్యురాలు డా”బివి సత్యవతి పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఎంపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.తీవ్ర పదజాలంతో ఏక వచనంతో విమర్శిస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. నమ్మి ఓట్లు వేసే పరిస్థితి లేదని చాలా చైతన్యవంతంగా ఉన్నారని నిజానిజాలు ప్రజలకు తెలుసు అన్నారు. కరోనా వంటి కష్టకాలంలో వైసిపి ప్రభుత్వం ప్రజలకు అన్నివిధాలా అండగా నిలబడిందన్నారు.అటువంటి కరోనా సమయంలో ఎక్కడ ఉన్నారో వారికే తెలియాలన్నారు. ఎవరో ఒకరు మద్దతు ఇస్తే గెలుపు సొంతం కాదని, వైసిపి కేడర్ మొత్తం సహాయ సహకారాలు అందించడం ద్వారానే తన గెలుపు సాధ్యమైంది అన్నారు.మహిళా ఎంపీనని చూడకుండా గతంలో ఎంతో చులకనగా మాట్లాడారని, అయినా సహనం వహించానన్నారు. మార్కెట్ యార్డులోని అయిదు ఎకరాలు స్వాహా చేయడానికి ప్రయత్నిస్తున్నానని ప్రచారం చేయడం సరికాదన్నారు. దాడి కారణంగానే చాలా కాలం పట్టణంలోని దేవాలయాలకు పాలకవర్గాలను ఏర్పాటు చేయడంలో ఆలస్యమైందని అన్నారు.