- యాదవులతో రామకృష్ణ భేటీ
- ప్రభుత్వం రాగానే కోటి రూపాయలతో కమ్యూనిటీ భవనం…
- యాదవుల ఆత్మీయ సమావేశంలో కొణతాల…
అనకాపల్లి: స్థానిక కొణతాల సుబ్రహ్మణ్యం కళ్యాణ మండపంలో జరిగిన యాదవ యాదవుల ఆత్మీయ సమావేశంలో అనకాపల్లి జిల్లా అయినందున జిల్లా హెడ్ క్వార్టర్ లో యాదవులకు ఒక ఎకరా స్థలంలో కోటి రూపాయల నిధులతో ఒక మంచి కమ్యూనిటీ భవనాన్ని నిర్మిస్తామని తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ హామీ ఇచ్చారు. పలువురు వక్తలు మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితులు దృష్ట్యా మన ప్రాంత అభివృద్ధి చందాలన్నా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కావాలన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యపడుతుందని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలంటే మన ప్రాంతంలో ఉన్న మన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణుని గెలిపించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా కొణతాల మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారంటే ఆనాడు కురుక్షేత్రంలో కృష్ణుడు పోషించిన పాత్రని ఇక్కడ యనమల రామకృష్ణుడు పోషించాడని. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కొండమీద గోవర్ధనగిరి ఏర్పాటు చేయడానికి రోడ్లు కూడా వేశారని దానికి నిధులు కూడా మంజూరు చేశారని ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని దానిని మరల మన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే తప్పకుండా దాన్ని పునరుద్దామని అన్నారు. 75 వేల కోట్ల రూపాయలు బీసీ సబ్ ప్లాన్ కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని. మొన్న జరిగిన బీసీ డిక్లరేషన్ సమావేశంలో ఈ పొత్తులో భాగంగా తెలుగుదేశం బిజెపి జనసేన బీసీ సబ్ ప్లాన్ 1,50,000 కోట్ల రూపాయలు కేటాయించే విధంగా మేనిఫెస్టో కూడా రూపొందించడం జరిగిందని ఇలా అనేక అంశాలు బీసీలకు మేలు జరిగే విధంగా ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్న యాదవ సంఘం నాయకులు కార్యకర్తలు జన సైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.