మునగపాక (ప్రజాముద్ర) అనకాపల్లి బైపాస్ నుంచి అచ్యుతాపురం రోడ్లు పునరుద్ధరణ చేపట్టడంతో వాహనదారులకు ఉపశమనం లభించింది. ఇంత లోనే రోడ్ల విశాలంగా గోతులు లేకపోవడంతో క్వారీ లారీల స్పీడు పెరిగింది. లారీల స్పీడుతో స్థానికంగా నివాసముండే వారితో సహా వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. అధిక స్పీడ్ పై వెళ్లే వాహనాలకు నెంబర్ కూడా లేకపోవడం విశేషం. అధికారులు తనిఖీలు చేపట్టి వాహనాల వేగానికి బ్రేక్ వేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. భారీ వాహనాలు అధిక లోడుతో వెళ్లే వాహనాలు ప్రత్యామ్నాయ రోడ్డును ఎంచుకోవాలని, ఈ రోడ్డుపై వెళ్లకుండా చూడాలని రోడ్డుకు పరిసర గ్రామాల ప్రజలు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా అధికారులు చర్యలు చేపడతారో గతంలో వలే చేతులు కాలాక ఆకులు పట్టుకుంటారో చూడాల్సి ఉంది. ఎన్ని ప్రభుత్వాలు మారిన ఎన్నికల ముందు రోడ్లు మరమ్మతులు చేపట్టడం తప్ప రోడ్డు విస్తరణ పనులు ముందుకు కదలని పరిస్థితి ఏర్పడింది.