2 C
New York
శుక్రవారం, జనవరి 31, 2025

Buy now

spot_img

ఐదేళ్ల వైసిపి పాలనలో రాష్ట్రం అధోగతి-మాజీమంత్రి

  • అవినీతి అక్రమాలే వైసిపి ఎజెండా…
  • వైసీపీ పాలనలో అనకాపల్లిలో అంతులేని అవినీతి…
  • కూటమి అభ్యర్థులతో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఆత్మీయ సమావేశం..

అనకాపల్లి : గడిచిన ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో అవినీతి, అక్రమాలే ఎజెండా గా పాలన సాగించారని అభివృద్ధి ఎక్కడా కానరాలేదని మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణ ఆరోపించారు. స్థానిక గవరపాలెం వీ.వీ.రమణ రైతు భారతి కళ్యాణ మండపంలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అభిమానుల ఆత్మీయ సమావేశం దాడి రత్నాకర్ అధ్యక్షతన నిర్వహించగా ముందుగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో అనకాపల్లి అసెంబ్లీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ 40 ఏళ్ల తరువాత దాడి కుటుంబంతో కలిసి పని చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు .చాలామంది అనేక సందర్భాల్లో మీరిద్దరూ కలిస్తే బాగుంటుందని ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్తూ ఉండేవారు కానీ ఆ సమయం ఈరోజు పవన్ కళ్యాణ్ వల్ల రానే వచ్చిందని అన్నారు. మన రాష్ట్రం మన జిల్లా మన నియోజకవర్గ అభివృద్ధికి సర్వతో ముఖాభివృద్ధికి దోహదపడుతుందని పూర్తిగా విశ్వసిస్తున్నానని మాస్టర్ దగ్గర పరిణతి చెందినటువంటి నాయకత్వం ఉన్నదని ఆయన మాటల్లో ఇంకా యువరక్తం ప్రవహిస్తుందని దాడిని ప్రశంసలతో ముంచెత్తారు.తనకు పోటీచేసే ఉద్దేశం లేదని రాజకీయాల నుంచి విరమించుకుందాం అనుకున్న సమయంలో పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఆశయాలు నా భావాలకు దగ్గరగా ఉన్నందున జనసేన పార్టీలో చేరడం జరిగిందని. పొత్తులో భాగంగా పోటీ చేయాల్సి వచ్చిందన్నారు.సీఎం రమేష్ ని గెలిపిస్తే పార్లమెంట్ లో తన గళాన్ని గట్టిగా వినిపించి అనకాపల్లికి అవసరమైన నిధులు రప్పించి అభివృధ్ధి చేస్తారన్నారు. ఈ ఐదేళ్లలో జగన్ తన కేసుల మాఫీ కోసమే ప్రయత్నించారు తప్ప ఎటువంటి అభివృద్ధి లేదన్నారు.

మాజీమంత్రి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ.. గతంలో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గుడివాడ అమర్నాధ్ను గెలిపించి చాలా పెద్ద తప్పు చేశామన్నారు. మరలా భవిష్యత్లో అటువంటి తప్పు జరగకుండా చూసుకోవాలన్నారు. అమర్నాథ్ హయాంలో అనకాపల్లి నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనంత రీతిలో అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు. ఈయన హయాంలో సుమారు 500 కోట్ల రూపాయల అవినీతి చేసి అవినీతి చక్రవర్తిగా పేరు సంపాదించారన్నారని ఎద్దేవా చేశారు. ఇటువంటి ప్రబుద్ధుడిని జగన్మోహనరెడ్డి మనకు బహుమతిగా అందించడం దౌర్భాగ్యం అన్నారు. ఈ ఐదేళ్లలో అమర్ చేసిందేమిటంటే.. అనకాపల్లి మండలంలో ఇద్దరిని, కశింకోట మండలంలో ఇద్దరిని, పట్టణంలో ఇద్దరినీ ఇలా బ్రోకర్లను నియమించుకొని వారి ద్వారా ఏ విధంగా అవినీతి చేయాలి అన్న విషయంలో అభివృద్ధి చెందారని అనకాపల్లి నియోజకవర్గాన్ని ఏ విధంగా భ్రష్టుపట్టించాలో ఆ విధంగా నీచాతినీచంగా తయారు చేసిన ఘనత అమర్ కే దక్కుతుందన్నారు.అలాగే ఇప్పుడు ఊరు పేరు అడ్రస్ లేని ఎక్కడో విదేశాల్లో ఉండే వ్యక్తి వద్ద నుంచి డబ్బులు తీసుకొని వైసీపీ ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చిందని అటువంటి వ్యక్తిని గెలిపిస్తే మరలా ఈ అమర్నాథ్ అండ్ కంపెనీ పాలనే చూడాల్సి వస్తుందని దీనిని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.అలాగే కొణతాల రామకృష్ణ మంచి కుటుంబ నేపథ్యం కలిగిన వ్యక్తి అని కొణతాల సుబ్రహ్మణ్యంతో సుదీర్ఘ కాలంపాటు తనకు ఎంతో సాన్నిహిత్యం ఉండేదని గుర్తు చేశారు. రాజకీయ పరంగా కొణతాల తాను ఆయా పార్టీ సిద్ధాంతాల మేరకు పనిచేసే వారమని వ్యక్తిగతంగా మా మధ్య ఎటువంటి బేదాభిప్రాయాలు లేవన్నారు. అయితే నేడు మేమిద్దరం కలిసి పని చేయడం ఎంతో సంతోకరమన్నారు. అలాగే ఆ కులం, ఈ కులం అనే సమస్య మాకు ఏనాడూ లేదని కులం ముఖ్యం కాదని పని చేసే వ్యక్తులు ముఖ్యమన్నారు. వెనుకబడిన అనకాపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని.అలాగే ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ స్థానిక వ్యక్తి కాకపోయినా ఎంతో సమర్థత ఉన్న నాయకుడని రెండుసార్లు రాజ్యసభ సభ్యునిగా పని చేశారని అటువంటి వ్యక్తి అనకాపల్లి ఎంపీ అయితే కేంద్ర ప్రభుత్వ సాయంతో అన్నివిధాలా అభివృద్ధి చేసుకోవచ్చన్నారు.అలాగే ఎన్టీఆర్ మార్కెట్ యార్డు ఎంతో మంది పేద రైతులు భూములు ఇస్తే నిర్మించుకున్నదని ఈ యార్డును రైతుల ప్రయోజనాల కోసమే వినియోగించాలి తప్ప మరి ఏ ఇతర వాటికి వినియోగించినా పార్టీలతో సంబంధం లేకుండా పోరాటం చేయక తప్పదన్నారు. అలాగే వారసత్వంగా వచ్చిన భూముల పాస్ పుస్తకాలపైన, భూముల్లో వేసే సర్వే రాళ్లపైన, చివరకు పుట్టిన బిడ్డకు ఇచ్చే జనన ధ్రువపత్రంపై కూడా జగన్ ఫోటో వేసుకోవడం దారుణమన్నారు. భూములు, ఆస్తుల విషయంలో కోర్టులకు కూడా అధికారాలు తీసేసిన ప్రభుత్వం
ఈ జగన్ ప్రభుత్వం అన్నారు. ఇటువంటి అన్యాయాలు, అక్రమాలను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, అన్యాయాలు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మూడు పార్టీల ఉమ్మడి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు అందరూ కృషి చేయాలని దాడి వీరభద్రరావు కోరారు.

ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో డబ్బుకు ఆశపడి ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా యువతకు జగన్ అన్యాయం చేశారన్నారు. ఉత్తరాంధ్రలో ఈ జన సందోహం చూస్తుంటే కొణతాల అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. తాను స్థానికున్ని కాదని కొంతమంది వైసీపీ నాయకులు చెబుతున్నారని, పార్లమెంట్కు పూర్తిస్థాయిలో పని చేసే వారు కావాలి తప్ప స్థానికత ముఖ్యం కాదన్నారు.

ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, దాడి జయవీర్, సీఎం రమేష్ తనయుడు రిత్విక్, మళ్ల రాజా, బొడ్డపాటి చినరాజారావు, తమ్మన సుబ్బారావు, పెద్ద సంఖ్యలో దాడి అభిమానులు , జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles