ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి సుప్రీం కోర్ట్ బెయిల్ మంజూరు చేయడం పట్ల అనకాపల్లి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కోణతాల హరినాథ్ బాబు హర్షం వ్యక్తం చేశారు. బిజెపి పార్టీ కేజ్రీవాల్ భారతదేశం అంతా పర్యటన చేసినట్లయితే బీజేపీకి గడ్డుకాలం తప్పదని తెలిసి రాజకీయ దురుద్దేశంతో కేజ్రీ వాల్ మీద అక్రమ కేసులు పెట్టి ఢిల్లీ ముఖ్యమంత్రి గా మూడుసార్లు ఢిల్లీని పరిపాలించి ప్రజల అభిమానం పొందిన కేజ్రీవాల్ జాతీయస్థాయిలో తమ ఉనికి ఎక్కడ అడ్డుగా వస్తాడో అనే భయంతో బిజెపి ప్రభుత్వం రాజకీయ దురుద్దేశం అరెస్టును చేయించిందని ఆరోపించారు. అయితే ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది అనేదానికి సుప్రీంకోర్టు ఇచ్చిన నిదర్శనమని అతి త్వరలోనే ఈ కేసు నుండి అరవింద్ కేజ్రీవాల్ మబ్బుల చాటు నుండి వచ్చిన మచ్చలేని చంద్రునిలా బయటపడతారని చెప్పారు. భారతదేశానికి ప్రధాని అవుతారని ఆమ్ ఆద్మీ పార్టీ అనకాపల్లి జిల్లా ఇన్చార్జ్ కొణతాల హరినాథ్ బాబు జోస్యం చెప్పారు . బిజెపికి అవినీతిపరులు భయపడతారు కానీ నీతిమంతులు కాదని వారి ప్రలోభాలకు లొంగడం గానీ బెదిరింపులకు బేదరడం వంటివి ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పటికీ చేయదని కొణతాల హరినాథ్ బాబు అన్నారు . ఎన్నికలకు కొద్ది నెలల ముందు అరవింద్ కేజ్రీవాల్ పొత్తుకు ఆహ్వానించిన బిజెపి ఆయన దానికి నిరాకరించడంతో ఆయనపై తప్పుడు ఆరోపణలు కేసులు పెట్టి ఆయనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిందని ఇది ప్రజాస్వామ్య దేశంలో సరైన చర్య కాదని ఆయన అన్నారు.