2.5 C
New York
శుక్రవారం, జనవరి 31, 2025

Buy now

spot_img

కొండకర్లలోవను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం-కూటమి అభ్యర్థులు

అనకాపల్లి:సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎలమంచిలి నియోజకవర్గం లో పర్యటిస్తున్న బీజేపీ ఉమ్మడి అభ్యర్ధి సీఎం రమేష్ కొండకర్లఅవను సందర్శించి బోటు షికారు చేసారు.ఆయనతో పాటు ఒడిస్సా రాజ్యసభ సభ్యులు భువనేశ్వర్ కలిటా  కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ కొండకర్ల లోవలోవున్న ఆవ అద్భుతంగా ఉందన్నారు.ఇంతటి సుందరమైన ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేయకపోవడం సరికాదన్నారు.దీనికి  పురాతన పర్యాటక కేంద్రంగా పేరు ఉందన్నారు. లోతును పెంచడం ద్వారా నీటిని నిల్వ చేయవచ్చన్నారు.తద్వారా నీటి నిల్వ కారణంగా చుట్టు ప్రక్కల ప్రాంతం నీటి ఎద్దడి తగ్గి, త్రాగు నీరు సమస్య పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు.పర్యాటక రంగంగా అభివృద్ధి కావడం వలన చుట్టు ప్రక్కల యువతకు,మహిళలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. రాజ్యసభ సభ్యులు భువనేశ్వర్ కలిటా            మాట్లాడుతూ కేంద్రంలోను ,రాష్ట్రంలోను ఎన్ డీ యే ప్రభుత్వం రావాలని కోరారు. కూటమి అభ్యర్ధులైన బీజేపీ ఉమ్మడి అభ్యర్ధి సీఎం రమేష్,ఎలమంచిలి అసెంబ్లీ అభ్యర్ధి సుందరపు విజయకుమార్ లను ను గెలిపించారని కోరారు. సుందరపు విజయకుమార్  మాట్లాడుతూ కేంద్రంలో పలుకుబడి కలిగిన సీఎం రమేష్ లాంటి వ్యక్తి ఈ ప్రాంతం నుండి పోటీ చేయడం అందరి అదృష్టం గా భావించాలన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles