అనకాపల్లి: నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ బుధవారం పట్టణంలోని గాంధీనగరం రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ ఘట్టాన్ని న భూతో న భవిష్యత్తు అన్న రీతిలో చేపట్టేందుకు పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. ఓ పండగ వాతావరణంలో నామినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుమారు 20 వేల మంది ప్రజలు, పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో భారీ ర్యాలీ చేపట్టేందుకు సమాయత్తం అవుతున్నారు. ఓ పక్కా ప్రణాళికతో భరత్ ముందుకు సాగుతున్నారు. స్థానిక రింగ్ రోడ్ లోని వైసీపీ క్యాంపు కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా పార్టీ శ్రేణులతో కలిసి భరత్ కుమార్ గాంధీ నగరంలో ఉన్న రిటర్నింగ్ అధికారికి కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. భరత్ నామినేషన్ అపూర్వ రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు విస్తృతంగా జరుగుతున్నాయి.