ప్రజాముద్ర-అనకాపల్లి: మార్కెట్లో పది రూపాయల నోట్ల కొరత ఏర్పడింది. కారణంగా వ్యాపారులు మరోప్రక్క ఇబ్బందులు పడుతున్నారు.ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో యూనియన్ బ్యాంక్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.పట్టణంలో మెయిన్ రోడ్ నందు యూనియన్ బ్యాంక్ బ్యాంకు సిబ్బంది పది రూపాయల నాణేలు వినియోగించాలని కోరుతూ విస్తృతంగా ప్రచారం చేశారు. వ్యాపార సముదాయాల వద్దకు వెళ్లి పది రూపాయలు నాణేలు పంపిణీ చేశారు. అపోహలు విడనాడి పది రూపాయల నాణాలు నగదు లావాదేవీలు కు యధావిధిగా వినియోగించాలని చెప్పారు.ఎవరైనా ఇచ్చిన స్వీకరించాలని అదేవిధంగా అందరికీ కూడా నాణేలు ఇవ్వాలని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బ్యాంకు డిప్యూటీ బ్రాంచ్ మేనేజర్ నానాజీ మాట్లాడుతూ పది రూపాయల నాణేలు కేవలం మన రాష్ట్రంలో మాత్రమే వినియోగించడం లేదన్నారు. మిగతా రాష్ట్రలలో చెల్లుబాటు జరుగుతున్నాయని చెప్పారు .పది రూపాయల నాణేలు చెల్లడం లేదనే అపోహతో చాలా మంది తీసుకోవడం లేదని ఈ అపోహ తొలగించాలని లక్ష్యంతో యూనియన్ బ్యాంక్ అనకాపల్లి శాఖ ప్రజలు వ్యాపారులకు అవగాహన కలిగించేందుకు ఈ కార్యక్రమం చేపట్టమన్నారు. బ్యాంకు అధికారులు వ్యాపారులకు ప్రజలకు పది రూపాయలు నాణేలు పంపిణీ చేశారు పది రూపాయలు నాణేలు చెల్లుతాయని అందరూ స్వీకరించాలని కోరారు.పది రూపాయలు నాణేలు తమ బ్యాంకు కు ఎవరు తీసుకొచ్చిన వారి ఖాతాలలో జమ చేసుకోవచ్చని ఖాతాదారులకు ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగులు కాండ్రేగుల హరికృష్ణ, ఆడారి రాము తదితరులు పాల్గొన్నారు.