2.5 C
New York
శుక్రవారం, జనవరి 31, 2025

Buy now

spot_img

పోలింగ్ కేంద్రాలలో పూర్తి సౌకర్యాలు కల్పించాలి

అనకాపల్లి, మే 7: జిల్లాలో వున్న పోలింగ్ కేంద్రాలలో పూర్తి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టరు జిల్లా ఎన్నికల అధికారి రవి పట్టన్ శెట్టి జిల్లా అధికారులు, నోడల్ అధికారులను ఆదేశించారు. ఈ విషయమై మంగళవారం కలెక్టరు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి పోలింగ్ కేంద్రంలో అవసరమైన కుర్చీలు, బల్లలు, విద్యుత్తు, తాగునీరు, ర్యాంపు, వీల్ ఛైర్, మరుగుదొడ్డి, పిడబ్ల్యు ఓటర్లకు సహాయకుడు విధిగా వుండాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరాకు జనరేటరును, నీడకు టెంటు ఏర్పాటు చేయాలన్నారు. ఒటర్లకు, పోలింగ్ సిబ్బందికి కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. అదే విధంగా పోలింగ్ సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన వసతి, టీ, అల్పాహారం, భోజన సదుపాయాలు కల్పించాలన్నారు. పోలింగ్ ముందురోజు, పోలింగ్ రోజు, పోలింగ్ పూర్తయిన తరువాత సిబ్బంది తిరిగి వెళ్లే వరకు వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్నారు. బి.ఎల్.వో., అంగన్ వాడి, మధ్యాహ్న భోజన నిర్వాహకుల ద్వారా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఎట్టి పరిస్థతుల్లో ఇతరుల జోక్యం వుండరాదని గుర్తించాలన్నారు. ఏర్పాట్లకు ముందుగా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలన్నారు. వీటికి అవసరమైన ఖర్చు ఎన్నికల నిధుల నుండి ఖర్చు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాలలో తగిన భద్రతతో పాటు అగ్నిమాపక పరికరాలు కుడా సిద్దంగా వుండాలన్నారు. జిల్లాలో వన్న 340 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్ఠి కేంద్రీకరించాలని, పట్టిష్టమైన బందోబస్తు ఏర్పటు వుండేలా చూసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి బి. దయానిధి, నోడల్ అధికారులు ఎస్.డి.సి.లు సుబ్బలక్ష్మి, కె.రమామణి,జిఎస్ డబ్ల్యుఎస్ అధికారి మంజులవాణి, డి.ఎమ్.అండ్.హెచ్.వో డాక్టర్ ఎ.హేమంత్, సిపివో జి.రామారావు, డిఆర్డిఏ పిడి శచీదేవి, డిఎస్ఓ కెవిఎల్ఎన్ మూర్తి, ఎపిఎమ్ఐపి డిడి జి.వి.లక్ష్మి, డిపివో ఆర్. శిరీషారాణి, స్త్రీశిశు సంక్షేమశాఖ పిడి అనంతలక్ష్మి,మత్స్యశాఖ డిడి పి.ప్రసాద్, పశుసంవర్ధక శాఖ జె.డి. బి.ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles