2 C
New York
శుక్రవారం, జనవరి 31, 2025

Buy now

spot_img

రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఒకటైన తెదేపా, జనసేన, భాజపా…

ట్రిపుల్ ఇంజన్ సర్కార్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం…మాజీమంత్రి కొణతాల రామకృష్ణ….అనకాపల్లి:రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు రీత్యా ప్రజలకు అన్ని సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ అభివృద్ధిని కూడా సాధించాలంటే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి అధికారానికి రావాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. అనకాపల్లి మండలంలోని పాపయ్య పాలెం పాపయ్య సంతపాలెం గ్రామాల్లో కాఫీ విత్ కేడర్ కార్యక్రమంలో భాగంగా ఆయన శుక్రవారం పర్యటించారు.ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చెరువు పనుల్లో ఉన్న గ్రామస్తులు వద్దకు వెళ్లి వారితో మాట్లాడారు.రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల ఉన్నతిని కాంక్షిస్తూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీలు ఒకటయ్యాయన్నారు. కూటమి విజయం సాధిస్తే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఉండవని చేస్తున్న తప్పుడు ఆరోపణలు పట్టించుకోవల్సిన అవసరం లేదన్నారు. అంతకన్నా మెరుగైన పథకాలను అర్హులందరికీ అందజేస్తామన్నారు. ఇప్పటికే కూటమి మెరుగైన ఆరు పథకాలను ప్రకటించామన్నారు. గ్రామాబ్యూదయానికి పెద్దపీట వేస్తామన్నారు. ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తనయుడు సీఎం రిత్విక్ మాట్లాడుతూ అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంను అన్ని విధాలుగా అభివృద్ధి చేయగల శక్తి సామర్థ్యాలు సీఎం రమేష్ గారికి ఉన్నాయన్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల రీత్యా రాష్ట్రానికి కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అండదండల అవసరమన్నారు. అనకాపల్లి జిల్లా వెనుకబాటును గుర్తించే ప్రధానమంత్రి మోడీ గారు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గారు ఎంపీ అభ్యర్థిగా రమేష్ గారిని అనకాపల్లిలో నిలబెట్టారన్నారు. సీఎం రమేష్, కొణతాల రామకృష్ణ ల గెలుపుతో అనకాపల్లి ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఎంపీటీసీ సభ్యులు చదరం నాగేశ్వరరావు, ఆయా పార్టీలు ప్రతినిధులు కరణం శ్రీను (చెక్కలన్న), శెట్టి వెంకటరమణ, గంగిరెడ్ల గోవింద, ఆళ్ల శ్రీను, బొట్టా నూకరాజు, పూడి అప్పలనాయుడు, గంగిరెడ్ల చెల్లారావు, బొట్టా అప్పలరాజు, మాకవరపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

  • కశింకోట మండలంలో జనసేనానికి బ్రహ్మరథం పట్టిన ప్రజలు…
  • కక్ష సాధింపు చర్యలే తప్ప అభివృద్ధి లేదు…
  • ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ భూములను రీ సర్వే చేపడతాం...

కూటమి అభ్యర్థి మాజీమంత్రి కొణతాల రామకృష్ణ…అనకాపల్లి జిల్లా కసింకోట మండలంలో అచ్చర్ల , మోసయ్యపేట , గోకివానిపాలెం గ్రామాల్లో జరిగిన గ్రామ సభలకు కూటమి అభ్యర్థి కొణతాల రామకృష్ణకు ప్రజలు బ్రహ్మరథం పట్టి అడుగు అడుగున హారతులు ఇస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ సమావేశాల్లో కొణతాలతో పాటుగా మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పాల్గొన్నారు. సమావేశాల్లో మండల స్థాయి నాయకులు పలువురు ప్రజలు ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలపై ఏకరువు పెట్టారు.మీరు గెలవాలని మీలాంటి మంచి నాయకులను మేము గెలిపించుకుంటామని గెలిచిన వెంటనే మా సమస్యలు పరిష్కరిస్తారని మిమ్మల్ని గెలిపించే భరోసా మాధవిని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ మీకు ఆధారపూరితమైన ఏదైతే లాండ్స్ ల్యాండ్ పోలింగ్ పేరుతో కబ్జా చేసి మీకు అన్యాయం చేశారో ప్రభుత్వం ఇచ్చిన వెంటనే దానిపై దృష్టి సారిద్దామని అలాగే మీ భూములు తప్పుడు సర్వేలతో అన్యాయం జరిగిందో వాటన్నింటికీ మళ్ళీ రీ సర్వే చేసి మీ భూములు మీకు అప్పజెప్పే విధంగా చర్యలు చేపడతామన్నారు. అలాగే గత ప్రభుత్వంలో గోవింద్ గారు ఏదైతే మీ గ్రామాన్ని దత్తత తీసుకుంటాను అన్నారో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయా గ్రామాలను దత్తత తీసుకొని మంచి మోడల్ విలేజ్ లో లుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ ఐదేళ్లలో పూర్తిగా కక్ష సాధింపు తప్ప అభివృద్ధి ఏమీ లేదని కచ్చితంగా మన ప్రభుత్వం వస్తాది మన అభివృద్ధి బాటలో ముందుకెళ్దాం అని అన్నారు.అలాగే రేపు జరగబోయే ఎన్నికలలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తుపై ఎంపీ అభ్యర్థికి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేయాలని ఈ రెండు గుర్తులను మీ గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో పొన్నగంటి అప్పారావు , నిమ్మదల సన్యాసి నాయుడు , గొంతిన శ్రీను , ఉగ్గిన రమణ మూర్తి , కాయల మురళీ , వేగి గోపీ , నయనం శెట్టి రమణారావు , గుదబండి జానూ, భీమవరపు శ్రీనివాసరావు , నయనం శెట్టి భూషణం , దొడ్డి నాగేశ్వర్రావు పలువురు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles