అనకాపల్లి:రాష్ట్రంలో రైతాంగంలో తీవ్ర ఆందోళన గురిచేస్తున్న ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై బిజెపి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయని సిపిఎం పార్టీ నేతలు గంటా శ్రీరామ్ తదితరులు పేర్కొన్నారు.కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నీతి అయోగ్ ప్రతిపాదించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఆగమేఘాల మీద అమలు చేసిందని చెప్పారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై వాస్తవాలను మరుగునపరిచి బిజెపి అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వ తీసుకొచ్చినట్లు చెప్పడం తగదన్నారు. జిల్లా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి మోడీ చేత లాండ్ టైటిలింగ్ యాక్ట్ ఫై నీతి అయోగ ప్రతిపాదన వెనక్కి తీసుకుంటామనే మాట చేప్పించాలని సవాల్ చేసారు.