అనకాపల్లి:ఆర్టిసి కాంప్లెక్స్ సమీపంలో ఉన్న కళ్యాణి నర్సింగ్ హోమ్ లో అరుదైన ఆపరేషన్ జరిగింది .వెదుర్ల సంజీవి అనే 41 ఏళ్ల వయసు కలిగిన మహిళ ఇటీవల అస్వస్థతతో ఆసుపత్రిలో చేరింది పేగులకు అతుక్కుపోయి ఉన్న కణితిని గుర్తించి డాక్టర్ నారాయణరావు శాస్త్రచికిత్స నిర్వహించి తొలగించారు.దీంతో ఆమె ప్రాణాపాయం నుండి కోలుకుంది. ఆపరేషన్ విజయవంతం చేసిన డాక్టర్‌కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నారాయణరావు మాట్లాడుతూ మందులతో తగ్గుతుందని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎవరు నిర్లక్ష్యం చేయడం తగలదని వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు .