2 C
New York
శుక్రవారం, జనవరి 31, 2025

Buy now

spot_img

శ్రావణ మాసం’ ముసుగులో స్వచ్ఛత లేని బంగారం అమ్మకాలు

అనకాపల్లి : ‘శ్రావణ మాసం’ ముసుగులో జిల్లాలో స్వచ్ఛత లేని బంగారం ఆభరణాల అమ్మకాలు జరుగుతున్నాయని కన్సూమర్‌ ఆర్గనైజేషన్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కాండ్రేగుల వెంకటరమణ ఆరోపించారు. కొన్ని జ్యూయలరీ షాపులు ప్రకటించే రాయితీలు, లక్కీ డ్రా కూపన్‌ల వంటి ఆకర్షణీయ ప్రకటనల పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శ్రీ గౌరీ గ్రంథాలయంలో కన్యూమర్‌ ఆర్గనైజేషన్స్‌ ఫెడరేషన్‌, అనకాపల్లి మండల కన్సూమర్స్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో ‘శ్రావణ మాసం … బంగారం అమ్మకాల్లో మోసం’ పై శనివారం జరిగిన మహిళా సదస్సులో వెంకటరమణ మాట్లాడారు. బంగారం స్వచ్ఛతపై భరోసా కోసం హాల్‌ మార్కింగ్‌ ఆభరణాలే కొనుగోలు చేయాలని, తిరిగి అమ్మేటపుడు కూడా అంతే విలువ పొందవచ్చన్నారు. వినియోగదారులు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, బిల్లులో బంగారం స్వచ్ఛత, ధర, తూకం ఉండాలన్నారు. వినియోగదారుల బలహీనతలను ఆసరగా తీసుకుని తరుగు, మేకింగ్‌ ఛార్జీలు పేరుతో వినియోగదారులను మోసగిస్తున్న జ్యూయలరీ షాపుల పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కొంతమంది బంగారు వ్యాపారులు కేడీఎం (కాడ్మియా) స్వచ్ఛతకు గుర్తింపుగా ప్రచారం చేస్తుంటారని అది వాస్తవం కాదన్నారు. కాడ్మియం అనేది బంగారు ఆభరణం తయారీలో అతికించడానికి వినియోగించే లోహమన్నారు. హాల్‌ మార్కింగ్‌ కల్గిన ప్రతి ఆభరణానికీ ప్రత్యేక సార్వత్రిక సంఖ్య (హెచ్‌యుఐడీ) ఉంటుందన్నారు. దీనివల్ల ఎక్కడ తయారీ, ఎక్కడ విక్రయించారో కూడా సులభంగా తెలుసుకోవచ్చాన్నారు. స్వచ్ఛత నిర్ధారణకు బీఐఎస్‌ కేర్‌ యాప్‌ వినియోగించాలని పిలుపునిచ్చారు. కొత్త ఆభరణాలను కొన్నప్పుడు పాత బంగారం అమ్మినపుడు సదరు బంగారం తాలూకూ స్వచ్ఛతను ‘క్యారెట్‌’లలో బిల్లులో చూపించాలన్నారు. బంగారం విక్రేతల మోసాలు, తూనిక ఖచ్చితత్వం, స్వచ్ఛతలపై అనుమానం ఉంటే బీఐఎస్‌.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో, నేషనల్‌ కన్సూమర్‌ హెల్ప్‌లైన్‌ 1915 నెంబర్‌కు, లీగల్‌ మెట్రాలజీ అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సదస్సులో గ్రంథాలయం మాజీ కార్యదర్శి మళ్ల బాపునాయుడు, ఉపాధ్యక్షులు కర్రి గంగాధర్‌, మళ్ల సూరిబాబు, శ్రీ జగన్నాథస్వామి దేవస్ధానం ఉత్సవ కమిటీ ఛైర్మన్‌ దాడి ఈశ్వరరావు, వృత్తి నైపుణ్య శిక్షకులు రాపేటి ప్రేమలత, మళ్ల మౌనిక, గిలకంశెట్టి నాగమణి పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles